![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో 15 వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కెరీర్ ప్రెజెంట్ పీక్ స్టేజ్ లో ఉంది. తెలుగు, తమిళ్ లో పలు భారీ సినిమాలకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 'అల వైకుంఠపురములో' మూవీలోనే 'బుట్టబొమ్మ' సాంగ్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా నేపథ్య సంగీతం అందించడంలో తమన్ దిట్ట. దీంతో వరుస సినిమాలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా శంకర్-చరణ్ కాంబోలో వస్తున్న మూవీలోనే ఛాన్స్ కొట్టేసాడు.

మాములుగా శంకర్ సినిమాలకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో తమన్ ఛాన్స్ కొట్టేయడం విశేషం. మరి ఈ సినిమాతో తమన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
![]() |
![]() |