![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'టక్ జగదీష్'. 'నిన్ను కోరి' తర్వాత శివ-నాని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి.. థియేటర్లు తెరచుకునేందుకు అనుమతి లభించడంతో.. ఈ సినిమాని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.
'టక్ జగదీష్' సినిమా ఈ నెలాఖరున రిలీజ్ అవుతుందంటూ వస్తున్న వార్తలపై నిర్మాతలు స్పందించారు. "నాని నటించిన టక్ జగదీష్ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల్ని నమ్మకండి. రిలీజ్ విషయంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న వెంటనే మేమే తెలియజేస్తాం'' అని పేర్కొన్నారు.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది 'టక్ జగదీష్' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటించారు. నరేష్, జగపతిబాబు, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థమన్ దీనికి సంగీతం అందించారు.
![]() |
![]() |