Home

»

Latest News

16 ఏళ్లు నిరీక్షించారు.. ఏకంగా క‌వ‌ల‌లే పుట్టారు!

Jul 17, 2021 10:50AM

 

మ‌ల‌యాళం ద‌ర్శ‌కుడు సాజి సురేంద్ర‌న్‌, అత‌ని భార్య సంగీత ఆనందానికి అవ‌ధులు లేవు. 16 సంవ‌త్స‌రాల సుదీర్ఘ నిరీక్ష‌ణ అనంత‌రం వారు త‌ల్లిదండ్రుల‌య్యారు. అదీ.. ఏకంగా ఇద్ద‌రు క‌వ‌ల పిల్ల‌ల‌కు! ఈ అత్యంత సంతోష‌క‌ర వార్త‌ను ఇటీవ‌ల త‌న ఫేస్‌బుక్ హ్యాండిల్ ద్వారా సాజి పంచుకున్నాడు. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల పాదాల ఫొటోను షేర్ చేసిన ఆయ‌న‌, "కొన్నిసార్లు మిర‌కిల్స్ జంట రూపంలో వ‌స్తాయి. ఇద్ద‌రు అబ్బాయిలు పుట్టారు. థాంక్ గాడ్." అని రాసుకొచ్చాడు.

స్కూలు రోజుల నుంచి త‌ను ప్రేమించిన సంగీత‌ను 2005 మార్చి నెల‌లో వివాహం చేసుకున్నాడు సాజి. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో ఆయ‌న మాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. 

2009లో 'ఇవ వివాహిత‌ర‌య‌ళ్' సినిమాతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన ఆయ‌న హ్యాపీ హ‌జ్బెండ్స్‌, ఫోర్ ఫ్రెండ్స్‌, హ‌జ్బెండ్స్ ఇన్ గోవా, షి టాక్సీ లాంటి సినిమాల్లో జ‌య‌రామ్‌, జ‌య‌సూర్య‌, భావ‌న‌, మీరా జాస్మిన్‌, కావ్యా మాధ‌వ‌న్ లాంటి స్టార్స్‌ను డైరెక్ట్ చేశాడు. 'ఫోర్ ఫ్రెండ్స్‌'లో క‌మ‌ల్ హాస‌న్ గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com