![]() |
![]() |

యూట్యూబ్ వీడియోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ముఖ్యంగా 'సాఫ్ట్ వేర్ డెవలపర్' అనే వెబ్ సిరీస్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల 'సూర్య' వెబ్ సిరీస్ తోనూ ఆకట్టుకున్నాడు. ఓ వైపు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ, మరోవైపు బుల్లితెర మీద ప్రసారమయ్యే స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. తాజాగా షణ్ముఖ్ ఒక లగ్జరీ కారును కొన్నాడు. ఈ కారు ధర దాదాపు రూ.15 లక్షలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
తన కొత్త కారుతో కలిసి దిగిన ఫోటోలను షణ్ముఖ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "ఇది నేను హై.. ఇది నా కొత్త కారు హై.. పార్టీలు లేవు హై.. త్వరలోనే కొత్త డ్రైవర్ ను పెట్టుకుంటాను హై" అంటూ తన స్టైల్లో ఫన్నీగా పోస్ట్ చేశాడు షణ్ముఖ్. పార్టీలు లేవు, డ్రైవర్ ను పెట్టుకుంటాను అని షణ్ముఖ్ పోస్ట్ చేయడంపై నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. 'డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వాడికే డ్రైవర్ విలువ తెలుస్తుంది' అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
కాగా గతంలో షణ్ముఖ్.. మద్యం సేవించి కారు నడపడం, ఆ కేసుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయితే అతడు నటించిన సూర్య వెబ్ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ తర్వాత అందరూ ఆ ఘటనను మర్చిపోయారు. కానీ ఆ ఘటన నుంచి షణ్ముఖ్ గుణపాఠం నేర్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీలు లేవని, డ్రైవర్ ని పెట్టుకుంటానని పోస్ట్ చేసినట్టున్నాడు.
![]() |
![]() |