![]() |
![]() |

కరోనా సమయంలో తన దాతృత్వంతో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమాలలో భారీగా ఆఫర్లు వస్తుండడంతో ఇక్కడ ఓ ఇల్లు ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో రూ.10 కోట్లతో ఓ ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం సోనూసూద్ చేతిలో పలు తెలుగు సినిమాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో సోనూసూద్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. దీనితోపాటు మరికొన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. కరోనా సమయంలో ఆయన సేవకు నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. దీంతో ఆయనతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు తెలుగు సినిమాల షూటింగులన్నీ దాదాపు హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్‌లో దాదాపు 10 కోట్ల రూపాయలతో సోనూసూద్ ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను చేస్తున్న సామాజిక సేవల దృష్ట్యా కూడా ఈ ఇల్లు ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట. ఆగస్టులోనే సోనూసూద్ హైదరాబాద్ లో కొన్న కొత్త ఇంటికి మారనున్నట్లు సమాచారం.
![]() |
![]() |