Home

»

Latest News

కత్తి మహేష్ మృతిపై అనుమానాలు

Jul 13, 2021 12:43PM

సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఆయన మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. 

కత్తి మహేష్ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని మంద కృష్ణ అన్నారు. కారులో మహేష్‌ తో పాటు ప్రయాణించిన సురేష్ అనే వ్యక్తికి ఒక్క గాయం కూడా కాకపోవడం అనుమానాలకు దారి తీస్తోందన్నారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సురేష్ కి చిన్న గాయం కూడా కాకపోవడం.. పక్కన కూర్చున్న మహేష్‌ కు అంత తీవ్రంగా గాయాలు కావడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే, చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి అంతా బాగానే ఉందని, కొద్ది రోజుల్లోనే కోలుకుని డిశ్చార్జి అవుతారని ప్రకటించి.. అంతలోనే మరణించారని చెప్పడం అనుమానాలకు దారి తీస్తోందన్నారు. కత్తి మహేష్‌ కు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆస్పత్రిలో జరిగిన వైద్యం, మరణం వరకు సమగ్ర దర్యాప్తు జరిపించాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com