Home  »  News  »  చరణ్ - శంకర్ మూవీకి స్టార్ రైటర్

Updated : Jul 13, 2021

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి టాలీవుడ్‌ లో పలు భారీ చిత్రాలకి మాటలు రాస్తున్న సాయిమాధవ్ బుర్రా పనిచేయబోతున్నారు. 

ప్రస్తుతం సాయిమాధవ్ చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్', పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు', పవన్-రానా నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్, శాకుంతలం చిత్రాలతో పాటు పలు భారీ చిత్రాలకు సాయిమాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. తాజాగా ఆయ‌న చేతిలో మ‌రో క్రేజీ ప్రాజెక్టు చేరింది. చరణ్-శంకర్ సినిమాకి డైలాగ్ రైట‌ర్ గా సాయిమాధ‌వ్ ఫిక్స్ అయ్యారు.

ఇటీవల చెన్నయ్ వెళ్ళిన సాయిమాధవ్.. డైరెక్టర్ శంకర్ ను కలిశారు. "జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓ ఫోటో దిగితే చాలనుకున్నాను. ఇప్పుడు ఆయన సినిమాకి మాటలు రాస్తున్నాను. అందుకు కారకులైన దిల్ రాజు, చరణ్‌ కు కృతజ్ఞతలు" అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని పంచుకున్న సాయిమాధవ్.. శంకర్ తో దిగిన ఫోటోని షేర్ చేశారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.