![]() |
![]() |

`సైరా.. నరసింహారెడ్డి` వంటి హిస్టారికల్ డ్రామా తరువాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం `ఏజెంట్`. స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు అఖిల్. అతనికి జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే మొదటి సినిమా. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అఖిల్ కి గురువుగా మమ్ముట్టి కనిపించబోతున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో మరో మాలీవుడ్ స్టార్ కూడా సందడి చేయనున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు.. ఫాహద్ ఫాజిల్. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ థ్రిల్లర్ `పుష్ప` కోసం ప్రతినాయకుడి వేషంలో నటిస్తున్న ఫాహద్.. తాజాగా `ఏజెంట్`లోనూ బ్యాడీగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అంతేకాదు.. ఈ పాత్ర కోసం భారీ పారితోషికమే అందుకోబోతున్నట్లు సమాచారం. త్వరలోనే `ఏజెంట్`లో ఫాహద్ ఫాజిల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. మరి.. మమ్ముట్టి, ఫాహద్ చేరిక `ఏజెంట్`కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. కాగా, డిసెంబర్ 24న `ఏజెంట్`ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
![]() |
![]() |