![]() |
![]() |

రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో శ్రీవిష్ణు కీలక పాత్రలో నటించాడు. స్నేహం ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం 2017 లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ టీమ్ లేటెస్ట్ గా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ టీమ్ తాజాగా రీయూనియన్ అయింది. రామ్, శ్రీవిష్ణు, లావణ్య, అనుపమ మరియు కిషోర్ తిరుమల తాజాగా కలిసి సరదాగా కొంత సమయాన్ని గడిపారు. ఈ విషయాన్ని రామ్, విష్ణు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇలా ప్లాన్ చేయకుండా కలిసిన మీటప్స్ లో ఎక్కువ ఫన్ ఉంటుందని రామ్ పోస్ట్ చేయగా.. 'క్రేజీ అన్ ప్లాన్డ్ రీయూనియన్' అంటూ విష్ణు పోస్ట్ చేశారు.
అలాగే ఐదుగురు కలిసి సరదాగా దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి. 'ఉన్నది ఒకటే జిందగీ' టీమ్ కలవడం చూస్తుంటే.. త్వరలో ఈ కాంబినేషన్ లో మరో మూవీ రానుందేమో అనే సందేహం కలుగుతోంది.
![]() |
![]() |