Home

»

Latest News

పుష్ప‌` రిలీజ్ డేట్ పై క‌న్నేసిన అఖిల్?

Jul 10, 2021 2:14PM

అక్కినేని బుల్లోడు అఖిల్ టైటిల్ రోల్ లో న‌టించిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`.  `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాని `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ తెర‌కెక్కించాడు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని జూన్ 19న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే, క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` వాయిదా ప‌డింది. రెండో ద‌శ విజృంభ‌ణ త‌గ్గి మ‌ళ్ళీ థియేట‌ర్లు తెరుచుకుంటున్న త‌రుణంలో.. త్వ‌ర‌లోనే `బ్యాచిల‌ర్`ని జ‌నం ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ - ఇండియా మూవీ `పుష్ప‌` కోసం అనుకున్న రిలీజ్ డేట్ ఆగ‌స్టు 13ని `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` టార్గెట్ చేస్తున్నాడ‌ట‌. పంద్రాగ‌స్టు వారాంతం కావ‌డంతో.. మేక‌ర్స్ ఈ తేది అయితేనే అనుకూలంగా ఉంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` న‌యా రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌స్తుంది.

`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`లో ఈషా రెబ్బా, ఆమ‌ని, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిశోర్, జ‌య‌ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. గోపీసుంద‌ర్ బాణీలు అందించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాని జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్, వాసు వ‌ర్మ నిర్మించారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com