![]() |
![]() |

ధనుష్, సాయిపల్లవి జంటగా నటించిన తమిళ చిత్రం 'మారి 2'లోని 'రౌడీ బేబీ' సాంగ్ మరో మైల్‌స్టోన్ అందుకుంది. శుక్రవారం (జూలై 9) యూట్యూబ్‌లో ఆ పాట 5 మిలియన్ లైక్స్ సాధించింది. ఒక సాంగ్‌కు సంబంధించి ఇది ఒక అరుదైన రికార్డ్. 2020 నవంబర్‌లో 'రౌడీ బేబీ' సాంగ్ యూట్యూబ్‌లో 2 బిలియన్ వ్యూస్ సాధించి, ఆ ఘనత సాధించిన తొలి సౌతిండియన్ సాంగ్‌గా చరిత్రకెక్కింది. యువన్‌శంకర్ రాజా కంపోజ్ చేసిన ఆ పాట 2018లో సినిమా రిలీజైన దగ్గర్నుంచీ ఫ్యాన్స్ ఫేవరేట్ సాంగ్‌గా మారింది. ఒక గోలీ సోడాను సర్వ్ చేస్తుండగా చూస్తున్నప్పుడు ఈ పాట రాయడానికి ఇన్‌స్పిరేషన్ కలిగిందని సరదాగా ధనుష్ చెప్పాడు.
'రౌడీ బేబీ' సాంగ్‌లో ధనుష్, సాయిపల్లవి చేసిన డాన్స్ సిగ్నేచర్ డాన్స్‌గా మారిపోయింది. ఫలితంగా ఆ పాట చరిత్రను తిరగరాసుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు 5 మిలియన్ లైక్స్‌తో మరో మైలురాయిని అందుకుంది. ధనుష్, ధీ పాడిన ఈ సాంగ్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించాడు. ఆ డాన్స్, ఊపునిచ్చే మ్యూజిక్ కలిసి 'రౌడీ బేబీ'ని ఫ్యాన్స్ మెచ్చిన సాంగ్‌గా మార్చాయి.
బాలాజీ మోహన్ డైరెక్ట్ చేసిన 'మారి 2'లో గ్యాంగ్‌స్టార్ మారిగా ధనుష్ నటించగా, సాయిపల్లవి, టొవినో థామస్, కృష్ణ, వరలక్ష్మీ శరత్‌కుమార్, విద్యా ప్రదీప్ కీలక పాత్రలు చేశారు. ఇది 2015లో వచ్చిన ధనుష్ సినిమా 'మారి'కి సీక్వెల్.
![]() |
![]() |