![]() |
![]() |

బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా వేశ్య పాత్రలో నటించబోతోందా? అవునన్నదే హిందీ చిత్ర వర్గాల మాట.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ త్వరలో వెబ్ సిరీస్ బాట పట్టనున్నారు. తను తొలిసారిగా రూపొందిస్తున్న ఈ సిరీస్ కి `హీరామండి` అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. భన్సాలీ సినిమాలు ఎలాగైతే భారీతనంతో రూపొందుతాయో.. అదే శైలిలో ఈ వెబ్ సిరీస్ కూడా తెరకెక్కనుందట. కాగా, ఈ చిత్రంలో అందాల తారలు సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారని సమాచారం. అంతేకాదు.. సోనాక్షి వేశ్య పాత్రలో దర్శనమివ్వనుందట. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా అభినయానికి మెండుగా అవకాశమున్న పాత్ర ఇదని వినికిడి. అదేవిధంగా.. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా కథక్ నేర్చుకోబోతుందట మిస్ సిన్హా. మరి.. ఈ భారీ వెబ్ సిరీస్ సోనాక్షి సిన్హాకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం సోనాక్షి చేతిలో `భుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా` ఉంది. ఇందులో అజయ్ దేవగణ్ కి జంటగా సోనాక్షి దర్శనమివ్వనుంది. త్వరలోనే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
![]() |
![]() |