![]() |
![]() |

అన్నా బెన్.. మలయాళ చిత్రాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి పరిచయం చేయనక్కర్లేని పేరు. చేసింది మూడు సినిమాలే అయినా.. నటిగా ఎనలేని గుర్తింపుని పొందిందీ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రస్. మరీముఖ్యంగా.. లాక్ డౌన్ టైమ్ లో అన్నా నటించిన `కుంబళంగి నైట్స్`, `హెలెన్`, `కప్పేళ` చిత్రాలు ఓటీటీ వేదికల్లో సినీ ప్రియులను విశేషంగా అలరించాయి. అయితే, ఇవన్నీ కూడా తొలుత థియేటర్స్ లో ఆదరణ పొంది.. ఆపై ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మురిపించాయి.
కాగా, హ్యాట్రిక్ విజయాల అనంతరం అన్నా బెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం `సారాస్` మాత్రం నేరుగా ఓటీటీలోనే సందడి చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో జూలై 5 నుంచి స్ట్రీమ్ అవుతున్న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాలో.. డైరెక్టర్ కావాలని కలలు కనే సారా విన్సెంట్ అనే యువతిగా అన్నా బెన్ కనిపించింది.
పేరంట్ హుడ్ ని రిస్క్ గా భావించి పిల్లలు వద్దనుకునే సారా.. అదే భావజాలం ఉన్న జీవన్ (సన్నీ వేన్)ని పెళ్ళిచేసుకున్నాక ఆమె కథ ఎలాంటి మలుపు తిరిగింది? `యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీ` పొందిన సారా తన కలని నెరవేర్చుకుందా? లేదా? అనే అంశాలతో `సారాస్` తయారైంది. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. మంచి సందేశంతో ముడిపడి తెరకెక్కింది. ఇక ఇందులో తన తండ్రి, స్ర్కీన్ రైటర్ బెన్నీ పి. నయరంబళమ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నాకి మెమరబుల్ థింగ్. అంతేకాదు.. తండ్రీకూతుళ్ళగానే వారి పాత్రలు రూపొందడం మరో విశేషం. మొత్తమ్మీద.. అన్నా బెన్ మరోసారి తన నేచురల్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేసింది.
![]() |
![]() |