![]() |
![]() |

సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ తో కలిసి `ఎఫ్ 2` (2019) అనే మల్టిస్టారర్ చేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. బ్లాక్ బస్టర్ బాట పట్టిన ఆ హిలేరియస్ ఎంటర్టైనర్.. వరుణ్ కెరీర్ లో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3`లోనూ వెంకీతో మరోసారి కలిసి నటిస్తున్నాడు వరుణ్.
ఇదిలా ఉంటే.. `వెంకిమామ`తో తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలు చేసిన ఈ మెగా హీరో.. త్వరలో వెంకీ మేనల్లుడు, యువసామ్రాట్ నాగచైతన్యతో ఓ మల్టిస్టారర్ చేయబోతున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే.. `సంతోషం` (2002), `మిస్టర్ పర్ఫెక్ట్` (2011) వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దశరథ్.. ఇటీవల చైతూ, వరుణ్ కి ఓ ఆసక్తికరమైన కథ చెప్పారట. అది నచ్చడంతో ఈ ఇద్దరు యువ కథానాయకులు కూడా కలిసి నటించేందుకు అంగీకారం తెలిపారని సమాచారం. త్వరలోనే చైతూ, వరుణ్ తేజ్ మల్టిస్టారర్ పై క్లారిటీ రానుంది. మరి.. దాదాపు ఐదేళ్ళ తరువాత మెగాఫోన్ పడుతున్న దశరథ్.. ఈ మల్టిస్టారర్ తోనైనా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
కాగా, ప్రస్తుతం చైతూ చేతిలో `లవ్ స్టోరి`, `థాంక్ యూ`, `లాల్ సింగ్ చద్ధా` (హిందీ) ఉన్నాయి. ఇక వరుణ్ విషయానికి వస్తే.. `ఎఫ్ 3`తో పాటు `గని` చేస్తున్నాడు.
![]() |
![]() |