![]() |
![]() |
.jpg)
పునర్జన్మ కథలతో తెలుగునాట పలు చిత్రాలు సందడి చేశాయి. వాటిలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఈగ` ఒకటి. చనిపోయిన కథానాయకుడు `ఈగ`గా పుట్టడం.. ఆ రూపంతోనే ప్రతినాయకుడిపై ప్రతీకారం తీర్చుకోవడం అనే వినూత్న కథాంశంతో ఈ విజువల్ వండర్ ని సృష్టించారు జక్కన్న. ఆద్యంతం ఆసక్తికరంగా.. ఆబాలగోపాలాన్ని అలరించేలా తెరకెక్కిన ఈ సినిమా ప్రధానంగా నాని (నాని), బిందు (సమంత), సుదీప్ (సుదీప్) పాత్రల చుట్టూ తిరుగుతుంది. బిందు మీద కన్నేసిన సుదీప్ అనే బిజినెస్ మేన్.. తనకు అడ్డుగా ఉన్న నాని(బిందు ప్రియుడు)ని చంపుతాడు. దాంతో.. `ఈగ`గా మళ్ళీ పుట్టిన నాని.. సుదీప్ ని ఎలా తుదముట్టించాడు? బిందుని సుదీప్ బారి నుంచి ఎలా రక్షించుకున్నాడు? అనే స్టోరీలైన్ తో `ఈగ` రూపొందింది. తెలుగుతో పాటు తమిళంలోనూ సమాంతరంగా తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రం.. రెండు చోట్లా ఆదరణ పొందింది.
స్వరవాణి కీరవాణి బాణీలు - నేపథ్య సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం `ఈగ`కి ప్రధాన బలంగా నిలిచాయి. డి. సురేశ్ బాబు సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ భారీ బడ్జెట్ మూవీని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. `బెస్ట్ ఫీచర్ ఫిల్మ్` (తెలుగు), `బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్` విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ అందుకున్న `ఈగ`.. 8 `నంది` పురస్కారాలను, 5 `ఫిల్మ్ ఫేర్` అవార్డ్స్ ని కూడా సొంతం చేసుకుంది. 2012 జూలై 6న విడుదలై ఘనవిజయం సాధించిన `ఈగ`.. నేటితో 9 ఏళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |