![]() |
![]() |

ప్రస్తుతం హిందీనాట స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది తాప్సీ పన్ను. అయితే, ఆమె తొలి అడుగులు పడింది మాత్రం తెలుగు చిత్రంతోనే. ఆ సినిమానే.. `ఝుమ్మంది నాదం`. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఈ మ్యూజికల్ డ్రామాలో సంప్రదాయ తెలుగు సంగీతంపై డాక్యుమెంటరీ తీయడానికి భారత్ కి వచ్చే యన్.ఆర్.ఐ శ్రావ్య పాత్రలో తాప్సీ నటించింది. గ్లామర్, పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ఈ పాత్రలో తనదైన అభినయంతో అలరించింది తాప్సీ. గొప్ప గాయకుడు కావాలనుకుని కలలు కనే బాలు అలియాస్ హరి అనే యువకుడి పాత్రలో మంచు మనోజ్ నటించిన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు.
స్వరవాణి కీరవాణి బాణీలు అందించిన ఈ ఆల్బమ్ లో పాటలన్నీ మంచి ఆదరణ పొందాయి. ``ఏం సక్కగున్నావ్ రో``, ``లాలి పాడుతున్నది``, ``సన్నాయి మోగింది``, ``దేశమంటే``, ``ఎంత ఎంత``, ``నిగ్రహం`.. వంటి గీతాలు అలరించాయి. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మంచు లక్ష్మి నిర్మించిన `ఝుమ్మంది నాదం`.. నేటితో 11 వసంతాలు పూర్తిచేసుకుంది. అంటే.. నేటితో తాప్సీ కెరీర్ కి 11 ఏళ్ళు పూర్తయ్యాయన్నమాట.
![]() |
![]() |