![]() |
![]() |
.jpg)
రెండో వివాహానికి ముందు వరకు గాయని సునీత చాలా తక్కువగా మాత్రమే వార్తల్లో కనిపించేవారు. మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేనితో నిశ్చితార్ధం చేసుకుంటున్నట్లు ఆమె వెల్లడించిన దగ్గర్నుంచీ, ఈ ఏడాది జనవరిలో పెళ్లయ్యేంత వరకూ ఆమె వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ప్రతిరోజూ ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త కనిపిస్తూ వచ్చింది. ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో తరచూ తనకూ, తన భర్తకూ, పిల్లలకూ సంబంధించిన పోస్టులతో ఆమె తన ఫాలోయర్స్‌ను ఆనందింపజేస్తూ వస్తున్నారు.
వివాహానంతరం భర్తతో కలిసి హనీమూన్‌కు కూడా వెళ్లొచ్చిన సునీత ఈటీవీ పాటల ప్రోగ్రామ్ స్వరాభిషేకంలో పాటలు పాడుతూ కనిపిస్తున్నారు. ఎస్పీ బాలు మృతి కారణంగా ఆగిపోయిన పాడుతూ తీయగా ప్రోగ్రామ్ త్వరలో సునీత వ్యాఖ్యాతగా మొదలవనున్నదని వినిపిస్తోంది.
లేటెస్ట్‌గా మరో న్యూస్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. భర్త రామ్‌తో కలిసి వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు సునీత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత ఏడాది లాక్‌డౌన్ విధించినప్పట్నుంచీ సినిమా థియేటర్లు మూతపడటంతో డిజిటల్ కంటెంట్‌కు గిరాకీ పెరగడం, ఓటీటీ ప్లాట్‌ఫామ్ విస్తృతమవడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్‌లతో ఆర్థికంగా బాగా ఆర్జించడంతో పాటు, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని సునీత దంపతులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ కొత్త వ్యాపారం సునీతకు ఎలా కలిసి వస్తుందో చూడాలి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.
.jpg)
![]() |
![]() |