![]() |
![]() |

'మాస్టర్' వంటి బ్లాక్‌బస్టర్ తరువాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న సినిమా 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్‌కి జోడీగా 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే నటిస్తోంది. కోలీవుడ్ యువ సంగీత సంచలనం అనిరుధ్ బాణీలు అందిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ కి సిద్ధమవుతోంది.
ఇదిలా ఉంటే.. 'బీస్ట్'లో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. సినిమాలో ఓ కీలక సన్నివేశంలో షారుక్ ఎంట్రీ ఇస్తాడని.. ఆ సీన్ 'బీస్ట్' హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని కోలీవుడ్ బజ్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం షారుక్ ఖాన్ 'పఠాన్' చిత్రంలో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో షారుక్‌కి జంటగా దీపికా పడుకోనే దర్శనమివ్వనుండగా.. జాన్ అబ్రహామ్, డింపుల్ కపాడియా ఇతర ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ యశ్ రాజ్ స్టూడియోలో జరుగుతోంది. 2022 ఈద్‌కి 'పఠాన్' థియేటర్స్ లోకి రానుంది.
![]() |
![]() |