![]() |
![]() |

తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన పెద్ద కుమార్తె ఐశ్యర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో ఆమె వివాహం రేపు (జూన్ 27) జరుగబోతోంది. ఐశ్యర్య వృత్తి రీత్యా డాక్టర్ కాగా.. రోహిత్ తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో క్రికెటర్. ఇక రోహిత్ తండ్రి దామోదరన్ తమిళనాడులో ప్రముఖ పారిశ్రామిక వేత్త. అంతేకాదు ఆయన మధురై పాంథర్స్ టీంకు స్పాన్సర్ కూడా.
కరోనా కారణంగా ఐశ్యర్య-రోహిత్ ల వివాహ వేడుకను నిరాడంబరంగా నిర్వహించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది బంధు మిత్రుల మధ్య వీరి వివాహ వేడుక మహాబలిపురంలో జరగునుంది. వివాహానంతరం కరోనా ఉదృతి తగ్గిన తర్వాత భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.
శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో 'ఇండియన్-2' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించనున్నారు. అలాగే బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో 'అపరిచితుడు' సినిమాను రీమేక్ చేయనున్నారు.
![]() |
![]() |