![]() |
![]() |

సినీనటుడు, క్రిటిక్ కత్తి మహేష్ ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయాలు కాగా.. ఆయనను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆయన సన్నిహితులు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం నెల్లూరులోని మెడికవర్ హాస్పిటల్‌లో 'మెకానికల్ వెంటిలేషన్' మీద కత్తి మహేష్ ఉన్నారు. ఎడమ కన్ను దాదాపుగా దెబ్బ తిన్నదని, ముఖంలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖం, కంటి చుట్టూ అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ జరుగుతోంది. హెడ్ ఇంజూరీ కూడా అయ్యిందని, బ్రెయిన్ సర్జరీ అవసరం కావచ్చని అంటున్నారు.
కత్తి మహేష్ పరిస్థితి గురించి 'హృదయకాలేయం' మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. "మహేష్ కత్తి పరిస్థితి కాస్త ప్రమాదకరం గానే ఉంది. ప్రస్తుతం కోమాలో వున్నాడు.. ఒక కన్ను కి తీవ్ర గాయం అయింది. మరో కన్ను కి ఆపరేషన్ చెయ్యాలి. బ్రెయిన్ లో కొంత ఇంజూరీ ఉంది. మెరుగైన వైద్యం కోసం చెన్నై కి షిఫ్ట్ చేస్తున్నారు. మూడు రోజులు గడిస్తే కానీ పూర్తి సమాచారం ఇవ్వలేము అంటున్నారు డాక్టర్లు. ప్రాణాపాయం నుంచి త్వరగా బయటపడాలని కోరుకుందాం." అని సాయి రాజేష్ పోస్ట్ చేశారు.
![]() |
![]() |