![]() |
![]() |

వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలిచే తమిళ కథానాయకుల్లో సూర్య ఒకరు. ఎప్పటికప్పుడు సరికొత్త భూమికల్లో దర్శనమిచ్చే సూర్య.. త్వరలో ఉద్యమ నాయకుడి వేషంలో కనిపించనున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. టాలెంటెడ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సూర్యకి 40వ చిత్రం. ఇందులో `గ్యాంగ్ లీడర్`, `శ్రీకారం` చిత్రాల కథానాయిక ప్రియాంకా అరుళ్ మోహన్.. సూర్యకి జంటగా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. పొల్లాచి ప్రాంతంలో మహిళలపై జరిగిన హత్యాచార ఘటనల నేపథ్యం స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పాండిరాజ్. ఇందులో బాధిత మహిళల తరపున పోరాడుతూ, న్యాయం కోసం రాజకీయ నాయకులను వ్యతిరేకించే వ్యక్తి పాత్రలో సూర్య కనిపించనున్నారట. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.
మరి.. ఉద్యమ నాయకుడి పాత్రలో సూర్య ఏ స్థాయిలో అలరిస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |