![]() |
![]() |

సిమ్రాన్.. రెండు దశాబ్దాల క్రితం దక్షిణాది యువత కలల రాణి. తెలుగు, తమిళ భాషల్లో నంబర్ వన్ హీరోయిన్ గా రాణించిన ఈ గ్లామర్ క్వీన్.. నెగటివ్ రోల్స్ లో పలకరించిన సందర్భాలు అరుదనే చెప్పాలి. కథానాయికగా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడు తమిళ చిత్రం `పార్తేన్ రసిత్తేన్` (2000) (`నా మనసిస్తా రా`కి మాతృక)లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాణించింది సిమ్రాన్. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. ఓ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.
కట్ చేస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యాక శివకార్తికేయన్, సమంత జంటగా నటించిన `సీమ రాజా` (2018)లో ప్రతినాయకురాలిగా పలకరించింది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. నటిగా మరోసారి తన సత్తా చాటుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రెండు సినిమాల్లో నెగటివ్ రోల్స్ లో నటిస్తూ తమిళనాట వార్తల్లో నిలుస్తోంది సిమ్రాన్. ఆ చిత్రాలే.. `అంధాగన్`, `సర్దార్`. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అంధాధున్`కి రీమేక్ గా రూపొందుతున్న `అంధాగన్`(ప్రశాంత్ హీరో)లో మాతృకలో టబు పోషించిన పాత్రని చేస్తోంది సిమ్రాన్. అలాగే.. కార్తి, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ `సర్దార్`లోనూ ప్రతినాయకురాలి వేషంలో దర్శనమివ్వనుంది. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ సినిమాలతో సిమ్రాన్ విలన్ గా ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
![]() |
![]() |