![]() |
![]() |

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'క్యాలీఫ్లవర్'. 'శీలో రక్షతి రక్షిత:' అనేది ట్యాగ్‌లైన్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఇంగ్లీష్ మ్యాన్ గా సంపూ ఈ మూవీలో కనిపించనున్నాడు. ఇటీవల సంపూ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.
'క్యాలీఫ్లవర్' సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని సంపూ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో వంటి నిండా అభరణాలు ధరించి లార్డ్ రామ అవతారంలో సంపూ లుక్ ఆకట్టుకునేలా ఉంది. వెనుక అంబులపొదిలో కొలబద్దలు ఉండటం చూస్తుంటే.. సంపూ మార్క్ కామెడీ మూవీ అని అర్థమవుతుంది.
.jpg)
ఈ మూవీలో సంపూకి జోడిగా వాసంతి నటిస్తోంది. గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్స్ పై ఆశ జ్యోతి గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి గోపీకిరణ్ కథ అందించగా.. ప్రజ్వల్ క్రిష్ సంగీతమందిస్తున్నారు.
![]() |
![]() |