![]() |
![]() |

మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన మూవీ 'మోసగాళ్లు'. దేశంలో జరిగిన అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సినిమాకు హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించారు. కాజల్ అగర్వాల్, సునీల్‌శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదలైంది.
విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడలో ఒకేసారి విడుదలై అలరించింది. ఇప్పుడు డిజిటల్ వేదికపై అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈరోజు(జూన్ 16) నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాలో విష్ణుకు సోదరిగా కాజల్ నటించింది. శ్యామ్ సీఎస్ సంగీతం అందించారు.
థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలా అలరించనుందో చూడాలి.
![]() |
![]() |