![]() |
![]() |

తెలుగు, హిందీ భాషల్లో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కృతి సనన్. ప్రస్తుతం ఆమె అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ యమబిజీగా ఉంది. వాటిలో పాన్ - ఇండియా మూవీ `ఆదిపురుష్` ఒకటి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో సీత పాత్రలో దర్శనమివ్వనుంది కృతి సనన్. `తానాజీ` ఫేమ్ ఓమ్ రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రావణ్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడి వేషంలో కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ఓ స్పెషల్ రోల్ లో నటించబోతున్నాడని సమాచారం. అయితే, ఆ పాత్ర ఏంటనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, కృతి సనన్ కి హిందీనాట మంచి విజయాన్ని అందించిన `లూకా చుప్పి` (2019)లో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించాడు. మళ్ళీ.. `ఆదిపురుష్` కోసం ఈ ఇద్దరు కలిసి నటించబోతుండడం విశేషమనే చెప్పాలి. త్వరలోనే `ఆదిపురుష్`లో కార్తిక్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న `ఆదిపురుష్`ని 2022 ఆగస్టు 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కదిద్దుకున్నాక.. `ఆదిపురుష్` చిత్రీకరణ పునః ప్రారంభం కానుంది.
![]() |
![]() |