![]() |
![]() |

'పటాస్', 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్', 'ఎఫ్ 2', 'సరిలేరు నీకెవ్వరు'.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా 'ఎఫ్ 3' చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ఇందులోనూ 'కో-బ్రదర్స్'గా సందడి చేయనున్నారు. ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణతోనూ, సూపర్ స్టార్ మహేశ్ బాబుతోనూ అనిల్ తన తదుపరి చిత్రాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. యువ కథానాయకుడు శర్వానంద్ తోనూ అనిల్ రావిపూడి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇప్పటివరకూ ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ సబ్జెక్టులతోటే సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ సీరియస్ సబ్జెక్ట్ అయిన 'విమెన్ ట్రాఫికింగ్' నేపథ్యంలో ఈ సినిమా తీయనున్నాడని వినికిడి. ప్రథమార్ధం అంతా పక్కా అనిల్ మార్క్ కామెడీతో సాగుతుందని.. ద్వితీయార్ధం మాత్రం 'విమెన్ ట్రాఫికింగ్'లో చిక్కుకున్న తన చెల్లెలిని కాపాడేందుకు కథానాయకుడు చేసే ప్రయత్నాల నేపథ్యంలో నడుస్తుందని టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం శర్వానంద్ చేతిలో 'మహాసముద్రం', 'ఆడాళ్ళూ మీకు జోహార్లు' చిత్రాలున్నాయి. అలాగే, తెలుగు-తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు శర్వా.
![]() |
![]() |