![]() |
![]() |

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ కోడలు, ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిక ఉదయనిధి మూడోసారి మెగాఫోన్ పట్టనున్నారు. ఇది వరకు ‘వనక్కమ్ చెన్నయ్’, ‘కాళీ’చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతిక.. ఇప్పుడు మూడో సినిమాను ప్రకటించారు.

తాను దర్శకత్వం వహించబోయే మూడో సినిమా వివరాలను తాజాగా కృతిక ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. కాళిదాస్ జయరాం, తన్య రవిచంద్రన్ జంటగా నటించనున్న ఈ సినిమాను.. రైజ్ ఈస్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పెంటెల సాగర్ నిర్మించనున్నారు. ఇదో జర్నీ ఆఫ్ లైఫ్ మూవీ అని.. ఆ ప్రయాణం కథలో అంతర్భాగంగా సాగుతుందని కృతిక తెలిపారు. రిచర్డ్ ఎం. నాధన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా లాక్‌డౌన్ పూర్తయ్యాక పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని తమిళంతోనాటు తెలుగులోనూ విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని సమాచారం.
![]() |
![]() |