![]() |
![]() |

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా నగేశ్ కుకునూర్ డైరెక్ట్ చేస్తోన్న 'గుడ్ లక్ సఖి' మూవీ త్వరలో నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలవుతుందని రెండు రోజులుగా ఆన్‌లైన్‌లో జోరుగా ప్రచారంలోకి వచ్చింది. కీర్తి మెయిన్ లీడ్‌గా చేసిన 'పెంగ్విన్', 'మిస్ ఇండియా' సినిమాలు సైతం థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు మహమ్మారి కారణంగా 'గుడ్ లక్ సఖి' చిత్రం కూడా ఓటీటీ బాట పట్టనుందనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో నిర్మాతలు ఆ ప్రచారాన్ని అధికారికంగా ఖండించారు. "మీడియా వ్యాప్తంగా మేం డైరెక్ట్ ఓటీటీకి వెళ్తున్నామన్నట్లు రూమర్స్ ప్రచారమయ్యాయి. దయచేసి ఆ ప్రచారాన్ని ఆపాల్సిందిగా మీడియాను కోరుతున్నాం. వాటిలో ఏమాత్రం నిజం లేదు. ఏదైనా అప్‌డేట్ ఉంటే మేమే చెప్తాం." అని నిర్మాత సుధీర్‌చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు.
వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో షూటింగ్ నేర్చుకొని, ఇండియా తరపున కాంపిటిషన్‌లో పాల్గొనే ఒక పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తోంది. ఆమె జోడీగా ఆది పినిశెట్టి నటిస్తుండగా, షూటింగ్ ట్రైనర్‌గా జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నాడు.
![]() |
![]() |