![]() |
![]() |

అక్కినేని బుల్లోడు అఖిల్ - స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో 'ఏజెంట్' పేరుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు అందించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అఖిల్ తరువాత ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇదేనని వినికిడి. త్వరలోనే 'ఏజెంట్'లో ఉపేంద్ర ఎంట్రీపై క్లారిటీ రానున్నది. సాక్షి వైద్య నాయికగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని డిసెంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కాగా, అఖిల్ తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' విడుదలకు సిద్ధమైంది. 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇక ఉపేంద్ర విషయానికి వస్తే.. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'గని'లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే, ఐదు కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
![]() |
![]() |