![]() |
![]() |

జూన్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానున్న 'ద ఫ్యామిలీ మ్యాన్ '2 కోసం మనమందరం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ సీజన్‌లో సీక్రెట్ ఏజెంట్‌గా మనోజ్ బాజ్‌పేయి నటనకు పలువురు ఆయన అభిమానులుగా మారిపోయారు. వారంతా ఇప్పుడు రెండో సీజన్‌లో ఇంకేం సాహసాలు చేస్తాడో చూడాలని ఈగర్‌గా ఎదురుచూస్తుంటే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్ట్రెస్‌లలో ఒకరైన సమంత అక్కినేని నటించడం ఈ సిరీస్‌పై అంచనాలను మరింతగా పెంచేసింది.
రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్‌తో తొలిసారిగా డిజిటల్ వేదికపై అడుగుపెడుతోంది సమంత. అందచందాలు, అద్భుతమైన అభినయం, సూపర్బ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎవరితోనూ సరిపోల్చలేని విలక్షణత కలబోసిన సమంత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తూ వస్తోంది. సీక్రెట్ ఏజెంట్‌ను సవాలుచేసే పాత్రతో ఆమె 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'కు ప్రధాన ఆకర్షణగా మారిందనడంలో సందేహం లేదు. ఆ పాత్ర పోషణ కోసం ఆమె ఎలా ప్రిపేరయ్యిందంటే...
క్యారెక్టర్‌ను పర్‌ఫెక్ట్‌గా పోషించడానికి...
'ద ఫ్యామిలీ మ్యాన్' కొత్త సీజన్‌లో సమంత పోషించిన పాత్ర పేరు రాజీ. ఒక బట్టల మిల్లులో పనిచేసే యువతిగా ఆమె కనిపించనున్నది. ఆ పాత్ర వాస్తవికంగా కనిపించడం కోసం, నిజంగానే ఒక బట్టల మిల్లులో బట్టలు నేసే పనిని ఆమె నేర్చుకుంది. అలాగే అక్కడ వర్కర్స్‌తో మాట్లాడి, వాళ్ల జీవనశైలి, వారి వ్యవహార సరళి గమనించింది.
కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్
సాధ్యమైనంత వాస్తవికంగా కనిపించడానికి రాజీ పాత్ర పోషణ కోసం కఠినమైన ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తూ, బాడీని ఫిట్‌గా ఉంచుకుంటూ ఆ పాత్రను పోషించడానికి రక్తాన్నీ, చెమటనూ చిందించింది సమంత.

మూడు రోజుల పాటు గదిలో బందీ
రాజీ పాత్రను అర్థం చేసుకొని, ఆ పాత్రలా బిహేవ్ చేయడానికి, స్క్రీన్‌పై సమంత కాకుండా రాజీయే కనిపించడం కోసం చాలా రీసెర్చి వర్క్ చేసింది సమంత. రాజీలా మారడానికి తనను తాను ఓ రూమ్‌లో మూడు రోజుల పాటు బంధించేసుకొని అనేక డాక్యుమెంటరీలు చూసింది.
ఫస్ట్ టైమ్ ఫైట్స్
'ద ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ సమంతను పూర్తి కొత్త అవతారంలో చూపించనుంది. ఇప్పటివరకూ చేయని డీగ్లామరైజ్డ్ రోల్ చేసిన ఆమె, ఆ రోల్ డిమాండ్ మేరకు హార్డ్‌కోర్ యాక్షన్ స్టంట్స్ కూడా చేసింది. అలాగే తొలిసారిగా స్క్రీన్‌పై సమంత చేతిలో గన్‌ను మనం చూడబోతున్నాం. దీని కోసం ఆమె స్టంట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంది. నెగటివ్ రోల్‌లో ఆమె ఎలాంటి ఉత్పాతాలు సృష్టించనుందో ట్రైలర్‌లో మనం శాంపిల్‌గా చూశాం.
![]() |
![]() |