![]() |
![]() |
.jpg)
మహేశ్‌బాబు హీరోగా యస్.యస్. రాజమౌళి రూపొందించే సినిమాపై చాలా కాలంగా రకరకాల కథలు ప్రచారంలోకి వస్తున్నాయి. యాక్షన్ డ్రామాగా రూపొందే ఈ సినిమాని ఒక ఆఫ్రికన్ ఫారెస్ట్‌లో తీస్తారంటూ ఇటీవల వదంతులు వచ్చాయి. అయితే వీటిలో నిజం లేదని నిర్మాత డాక్టర్ కె.ఎల్. నారాయణ తేల్చేశారు.
"ఇంతదాకా ఈ ప్రాజెక్టుపై ఏదీ ఫైనలైజ్ కాలేదు. కొన్నేళ్ల క్రితం రాజమౌళి, మహేశ్ ఇద్దరూ నాతో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. ఇప్పుడు వాళ్లిద్దరి మార్కెట్ అనూహ్య స్థాయిలో పెరిగినా, తామిచ్చిన మాటపై నిలబడి ఉన్నారు. ఆ సినిమా స్టోరీలైన్‌పై రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. నిజానికి ఇంకా అది పూర్తి కాలేదు. ఇప్పటికే స్క్రిప్టుపై రాజమౌళి టీమ్ వర్క్ స్టార్ట్ చేసింది. అది రెడీ అయ్యాక వాళ్లు నాకు చెప్తారు." అని ఆయన చెప్పారు. చాలా కాలంగా ఆయన ఈ ప్రాజెక్టు కోసమే ఎదురుచూస్తూ వేరే ఏ సినిమాలనీ తీయకుండా తన రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో మునిగివున్నారు.
రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా 'ఆర్ఆర్ఆర్' తీస్తున్నారు. అది రిలీజయ్యాక మహేశ్‌తో సినిమాని స్టార్ట్ చేస్తారా, లేదా అనేది స్పష్టం కావట్లేదు. ఎందుకంటే మహేశ్ ఇప్పుడు పరశురామ్ పేట్ల డైరెక్షన్‌లో 'సర్కారువారి పాట' మూవీ చేస్తున్నాడు. దాని తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి అంగీకరించాడు. అలాగే తనతో మరో సినిమా చేయడానికి మహేశ్ అంగీకరించారని ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' ఫేమ్ అనిల్ రావిపూడి వెల్లడించాడు. మహమ్మారిని దృష్టిలో పెట్టుకుంటే మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయంలో అనిశ్చితి నెలకొని ఉంది.
![]() |
![]() |