![]() |
![]() |

అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఉండే సందడి అంతా ఇంతా కాదు. అదే స్థాయిలో ఆయన సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో మరో మైలు స్టోన్ ను అందుకున్నారు. తారక్ ట్విట్టర్ లో 5 మిలియన్ మార్క్ కు చేరుకున్నారు.
నిన్న(మే 28) నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా.. ఒకేరోజు తారక్ ను దాదాపు 2 వేల మంది ఫాలో అవడం విశేషం. దీంతో ట్విట్టర్ ఖాతాలో తారక్ ఫాలోవర్స్ సంఖ్య 5 మిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో సౌత్ లో 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అతి కొద్ది మంది స్టార్స్‌లో ఒకరిగా తారక్ నిలిచారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #5MFollowersForNTR అనే హ్యాష్ ట్యాగ్ ను ఆయన ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.
కాగా, తారక్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' మూవీలో నటిస్తున్నారు. ఆ తరువాత కొరటాల శివతో ఒక సినిమా, ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నారు.
![]() |
![]() |