![]() |
![]() |

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - `మహానటి` డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో.. ప్రభాస్ కి జోడీగా బాలీవుడ్ దివా దీపికా పదుకొణే నాయికగా దర్శనమివ్వనుండగా.. `బిగ్ బి` అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ క్రేజీ వెంచర్.. సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్టోరీలైన్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. టైమ్ మెషీన్ లో 2050 కాలానికి వెళ్ళిన కథానాయకుడికి.. ఆ కాలంలో ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. టైమ్ ట్రావెల్ చేసే హీరో జర్నీలో హీరోయిన్ ఎలా భాగమవుతుంది? అమితాబ్ పాత్ర ఏంటి? అనేవి కూడా ఈ కథలో కీలకాంశాలే. మొత్తమ్మీద.. ప్రభాస్ - నాగ్ అశ్విన్ పాన్ - వరల్డ్ మూవీ సాంకేతికంగా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందన్నమాట.
కాగా, ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ స్వరాలు అందించనున్నారు. 2023లో ఈ సినిమా తెరపైకి వచ్చే అవకాశముంది.
![]() |
![]() |