![]() |
![]() |

పల్లెటూరి నేపథ్య చిత్రాలకు చిరునామాగా నిలిచిన అగ్ర కథానాయకుల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకరు. హీరోగా బాలయ్య కెరీర్ లో టర్నింగ్ పాయింట్ మూవీగా నిలిచిన `మంగమ్మ గారి మనవడు`(1984).. ఈ తరహా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమానే కావడం విశేషం. ఇదిలా ఉంటే.. స్వల్ప విరామం అనంతరం ఈ స్టార్ హీరో.. మరో అవుట్ అండ్ అవుట్ విలేజ్ డ్రామాలో నటించబోతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `తొలిప్రేమ`, `రంగ్ దే` చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వెంకీ అట్లూరి.. బాలయ్య కోసం ఓ పల్లెటూరి నేపథ్య కథని సిద్ధం చేశారట. ఈ స్క్రిప్ట్ కి నటసింహ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని బజ్. అంతేకాదు.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించనుందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే బాలయ్య, వెంకీ కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
కాగా, ప్రస్తుతం బాలయ్య చేతిలో `అఖండ` చిత్రం ఉంది. `మాస్ ఎంటర్టైనర్స్` స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ యాక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేనితో బాలయ్య నెక్స్ట్ వెంచర్ రూపొందనుంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ మూవీ చేయబోతున్నారు.
![]() |
![]() |