![]() |
![]() |

నటుడిగా `మక్కల్ సెల్వన్` విజయ్ సేతుపతిది 25 ఏళ్ళ సినీప్రస్థానం. చిన్న చిన్న వేషాలతో కెరీర్ ని ఆరంభించిన విజయ్.. తమిళ చిత్రం `పిజ్జా` (2012)తో హీరోగా టర్న్ అయ్యారు. అదే సినిమా డబ్బింగ్ వెర్షన్ తో తెలుగువారికీ చేరువయ్యారు. ఆపై కథానాయకుడిగా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూనే.. ప్రతినాయకుడి పాత్రల్లోనూ తమిళనాట తనదైన ముద్రవేశారు విజయ్ సేతుపతి. తెలుగులోనూ `సైరా.. నరసింహారెడ్డి` (2019), `ఉప్పెన` (2021) చిత్రాల్లో సందడి చేశారు. `సైరా`లో కీలక పాత్రలోనూ.. `ఉప్పెన`లో విలన్ గానూ ఆయన ఆకట్టుకున్నారు.
కట్ చేస్తే.. ఈ టాలెంటెడ్ యాక్టర్ త్వరలో ఓ స్ట్రయిట్ తెలుగు పిక్చర్ లో హీరోగా నటించబోతున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `ఉప్పెన` చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట. దీనికి విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడానికి తెలుగు భాషపై మరింత దృష్టి సారిస్తున్నారట సేతుపతి. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
![]() |
![]() |