![]() |
![]() |
.jpg)
మహేశ్‌బాబు లేటెస్ట్ ఫిల్మ్ 'సర్కారువారి పాట' అప్‌డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 31 సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఏదో ఒక అప్‌డేట్ వస్తుందనే కొండంత ఆశతో ఉన్న వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుత కొవిడ్ సెకండ్ వేవ్‌తో ఉత్పన్నమైన పరిస్థితుల కారణంగా ఆ రోజు ఎలాంటి అప్‌డేట్ ఉండదని టీమ్ మహేశ్‌బాబు పేరిట ఓ అధికారిక ప్రకటన వెలువరించింది.
"ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, వ్యక్తిగతంగా మనం, అత్యధికంగా సమాజం ప్రభావితమవుతున్న నేపథ్యంలో 'సర్కారువారి పాట' చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ అయినా ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని నిర్మాతలు నమ్ముతున్నారు. ఈ విషయంలో ఎలాంటి అనధికార, తప్పుడు వార్తలను వ్యాప్తి చెయ్యవద్దని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అఫిషియల్ అకౌంట్లలోనే అన్ని అధికారిక సమాచారాన్నితొలిగా పోస్ట్ చేస్తాం. అంతదాకా, క్షేమంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. థాంక్యూ.. మీ.. టీమ్ మహేశ్‌బాబు" అంటూ ఆ ప్రకటన తెలియజేసింది. అంటే.. మే 31న ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఉండదన్న మాట. ఆ రోజు టీజర్ రాకపోయినా, చిన్న గ్లిమ్స్ లాంటిదో, అదీ కాకపోతే.. మహేశ్ ఫస్ట్ లుక్కో రిలీజవుతుందని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

మహేశ్ సరసన కీర్తి సురేశ్ తొలిసారి నాయికగా నటిస్తోన్న 'సర్కారువారి పాట'ను పరశురామ్ డైరెక్ట్ చేస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి. 2022 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది నిర్మాతల సంకల్పం.
![]() |
![]() |