![]() |
![]() |

సాధారణంగా తమ అమ్మానాన్నలు విడిపోతుంటే పిల్లలు విలవిల్లాడిపోతారు. అమ్మానాన్నలతో కలిసుండాలని కోరుకుంటారు. కానీ అందాల తార శ్రుతి హాసన్ అందుకు భిన్నం. తన అమ్మానాన్నలు కమల్ హాసన్, సారిక విడాకులపై ఆమె మనసు విప్పి మాట్లాడింది. కమల్, సారిక 2004లో విడిపోయారు. ఆ ఇద్దరూ విడిపోవడం తనకు ఎందుకు సంతోషకరమో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది శ్రుతి.
"వారు విడిపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. కలిసి జీవించలేని ఇద్దరు వ్యక్తులు, ఏదో కారణం చేత బలవంతంగా కలిసి జీవించాలని నేననుకోను. వాళ్లు అద్భుతమైన తల్లిదండ్రులుగా కొనసాగవచ్చు. ప్రత్యేకించి నేను మా నాన్నకు బాగా క్లోజ్. మా అమ్మ బాగానే ఉంటుంది. అలాగే మా జీవితాల్లో ఓ భాగంగా ఉంటుంది. నిజానికి ఇలా ఉండటమే మంచిది." అని చెప్పుకొచ్చింది శ్రుతి.
తన అమ్మానాన్నలు విడిపోయినప్పుడు తాను చిన్నదాన్ననీ, చాలా మామూలుగా వారు విడిపోయారనీ ఆమె తెలిపింది. కలిసున్నప్పటి కంటే విడిపోయాకే వారు హ్యాపీగా ఉన్నారని చెప్పింది శ్రుతి.
సినిమాల్లో కలిసి నటించేటప్పుడు ప్రేమలో పడిన కమల్, సారిక 1988లో పెళ్లి చేసుకున్నారు. మొదట్లో బాగానే ఉన్నా, క్రమంగా భేదాభిప్రాయాలు తలెత్తి 2004లో విడిపోయారు. ఆ ఇద్దరికీ మొదట శ్రుతి, తర్వాత అక్షర పుట్టారు.
![]() |
![]() |