![]() |
![]() |

ఆక్సిజన్ కొరతతో చాలా మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంకులను వారంలోపు ఏర్పాటు చేస్తామని చిరంజీవి ప్రకటించిన విధంగానే.. జిల్లా అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ జరిగింది. అనంతపూర్, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు ఈరోజు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో గురువారం నాడు ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభంకానున్నాయి. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. మిషన్ ప్రారంభమైందని, ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదని ఆయన అన్నారు.
![]() |
![]() |