![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. తరువాత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో హైదరబాద్ లో జరగాల్సిన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా మే 31న మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దీంతో టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కి నిరాశ తప్పదని తెలుస్తోంది. కృష్ణ బర్త్ డే కి టీజర్ విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం.
టీజర్ కట్ చేసేందుకు సరిపడ ఫుటేజ్ లేదని, దీంతో మూవీ టీం టీజర్ విడుదలను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లో 15 రోజుల పాటు జరుపుకున్న షూటింగ్ షెడ్యూల్ లో కేవలం ఒక యాక్షన్ స్వీకెన్స్, రెండు సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే జరిగిందట. టీజర్ కట్ చేసేందుకు సరిపడ సన్నివేశాలు లేకపోవడంతో టీజర్ విడుదల విషయంలో మూవీ టీం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణ బర్త్ డేకు ఒక నిమిషం లోపు గ్లింప్స్ వంటి దాన్ని విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుందట. లేదంటే ఓ పోస్టర్ లాంటిదేదైనా విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
![]() |
![]() |