![]() |
![]() |

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో పాన్ - ఇండియా మూవీ `లైగర్` చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గాక `లైగర్` మళ్ళీ పట్టాలెక్కనుంది.
ఇదిలా ఉంటే.. పూరి తన నెక్స్ట్ వెంచర్ ని పాన్ - ఇండియా స్టార్ యశ్ తో చేయబోతున్నట్లు కొన్నాళ్ళ క్రితం కథనాలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. అంతేకాదు.. ఇందులో కథానాయకుడి పాత్ర పూరి మార్క్ హీరోయిజంతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందని టాక్. త్వరలోనే పూరి, యశ్ ఫస్ట్ కాంబో మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.
కాగా, గతంలో పూరీ జగన్నాథ్.. కన్నడ కథానాయకులు శివరాజ్ కుమార్ తో `యువరాజా` (`తమ్ముడు`కి రీమేక్), పునీత్ రాజ్ కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ `అప్పు` (`ఇడియట్`కి మాతృక) చేశారు. అలాగే ఇషాన్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో `రోగ్` అనే బైలింగ్వల్ మూవీ చేశారు. ఈ క్రమంలో.. యశ్ తో చేయబోయే పాన్ - ఇండియా ప్రాజెక్ట్.. పూరికి నాలుగో కన్నడ సినిమా కానుంది.
![]() |
![]() |