![]() |
![]() |

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`, `జాతిరత్నాలు`తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ నేపథ్యంలో.. నవీన్ తదుపరి చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొంది. విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన యూవీ క్రియేషన్స్ సంస్థ నవీన్ నెక్స్ట్ వెంచర్ ని నిర్మించనుందని టాక్. అంతేకాదు.. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్కా శెట్టితో కలిసి నటించబోతున్నాడట నవీన్ పోలిశెట్టి. 40 ఏళ్ళ అవివాహిత మహిళకు, 25 సంవత్సరాల యువకుడికి మధ్య సాగే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని బజ్. `రా రా కృష్ణయ్య` ఫేమ్ పి. మహేశ్ డైరెక్ట్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి.. `మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి` అనే టైటిల్ ఫిక్స్ అయిందని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం అటు అనుష్క, ఇటు నవీన్.. ఇద్దరు కూడా రూ. 5 కోట్ల పారితోషికాన్ని అందుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. అటు సీనియర్ హీరోయిన్ అయిన అనుష్క.. ఇటు ఆమెకి
జూనియర్ అయిన హీరో నవీన్.. సేమ్ రెమ్యూనరేషన్ అందుకోనుండడం టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది. మరి.. స్వీటీ, నవీన్ పారితోషికంపై జరుగుతున్న ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
![]() |
![]() |