![]() |
![]() |
.jpg)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా గురువారం (మే 20) 'ఆర్ఆర్ఆర్' మేకర్స్ కొమరం భీమ్ ఇంటెన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నీళ్లలోంచి చెంగున గెంతుతూ బల్లేన్ని విసురుతున్న కొమరం భీమ్ లుక్‌లో తారక్ కనిపించాడు. ఇంతకుముందు రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన అతని అల్లూరి సీతారామరాజు లుక్‌తో పోల్చుకుంటే తారక్ లేటెస్ట్ లుక్ తీసికట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే సీతారామరాజును నిప్పు (Fire)గా, కొమరం భీమ్‌ను నీరు (Water)గా ప్రెజెంట్ చేస్తున్నట్లు రాజమౌళి ప్రకటించారు. అప్పుడే తారక్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఫైర్‌కు ఉన్నంత ఫోర్స్ వాటర్‌లో లేదు కదా!
ఇప్పుడు మూడేళ్ల పాటు 'ఆర్ఆర్ఆర్' కోసం తన టైమ్‌ను డెడికేట్ చేసిన తారక్‌కు చూపించే విధానం ఇదేనా? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. తారక్ బర్త్‌డేకి ఏదో ఊహించుకుంటే రాజమౌళి అండ్ కో ఇంకేదో చూపించారనీ, ఏమాత్రం అంచనాలకు తగ్గట్లు తారక్ ఇంటెన్స్ పోస్టర్ లేదనీ వారు అభిప్రాయపడుతున్నారు. తారక్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ, కొమరం భీమ్ ఇంటెన్స్ పోస్టర్‌ను షేర్ చేస్తూ, ప్రొడక్షన్ హౌస్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ చేసిన ట్వీట్‌కు తారక్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ దీనికి అద్దం పడుతున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అయితే రాయడానికి వీలవని భాషలో బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు.
ఒక అభిమాని తనకు ఆ పోస్టర్ చూస్తే బూతులు వస్తున్నాయని చెప్పాడు.

ఒకరైతే "చెప్పుతో కొట్టాలిరా నిన్ను" అని కామెంట్ చేశారు.

చాలామంది ఫ్యాన్స్.. ఇది సినిమాలో ఒరిజినల్ స్టిల్‌లా లేదనీ, ఫ్యాన్ మేడ్ స్టిల్‌లా ఉందనీ అభిప్రాయపడ్డారు.

ఒక అభిమాని మొత్తం మూడ్ చెడగొట్టారన్నాడు. ఇంకో అభిమాని ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసుకొమ్మని సలహా ఇచ్చాడు. మరో అభిమాని "నీకు ఎందుకురా పాన్ ఇండియాలు పాన్ పరాగ్‌లు అమ్ముకోక" అని కామెంట్ చేశాడు.

ప్రతిసారీ తారక్ దగ్గరకు వచ్చేసరికి డిజప్పాయింట్ చేస్తున్నారని ఓ అభిమాని బాధపడ్డాడు.

ప్రొడక్షన్ వాల్యూస్ కూడా క్వాలిటీగా ఉన్నట్లు కనిపించడం లేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

మొత్తానికి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కంటే నెగటివ్ రెస్పాన్స్ రావడంతో రాజమౌళి అండ్ కో కూడా షాక్‌కు గురైనట్లు సమాచారం.
![]() |
![]() |