![]() |
![]() |

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన తేజస్వికి బిగ్ బాస్ షోతో ఇమేజ్ మరింత పెరిగింది. అయితే బిగ్ బాస్ షో వలన ఎంత పాపులారిటీ వచ్చిందో.. అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా వచ్చింది. ఈ షో తరువాత ఆమె ఒకట్రెండు షోలు చేసినప్పటికీ ఏదీ వర్కవుట్ కాలేదు. సినిమా అవకాశాలు కూడా తగ్గాయనుకున్న సమయంలో ఆమెకి ఓ ఆఫర్ వచ్చింది.
సకమిట్‌మెంట్ అనే సినిమాలో నటించింది తేజస్వి. గత రెండేళ్లుగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు కానీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. సినిమా ట్రైలర్ మాత్రం విడుదలైంది. ఎంతో బోల్డ్ గా ఉన్న ట్రైలర్ లో సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించారు. ఇదిలా ఉండగా.. తేజస్వి ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటోంది. ఆమె కాలికి పెద్ద గాయం కూడా ఉంది. బెడ్ మీద పిండికట్టు కట్టిన కాలిని హైలైట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఫొటోను షేర్ చేసింది తేజు.

దానితో పాటు ఇన్‌స్టా స్టోరీస్‌లో కాలి గాయంతోటే డాన్సు చేస్తున్న, పిల్లలతో ఆడుకుంటున్న కొన్ని వీడియో క్లిప్స్‌ను కూడా ఆమె షేర్ చేసింది. అయితే తన కాలికి ఎందుకు గాయమైందనే విషయం మాత్రం తేజు వెల్లడించలేదు. దాంతో ఆమె ఫ్యాన్స్ కాలికి ఎలా గాయమైంది..? ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ అమ్మడు మాత్రం ఎవరికీ బదులివ్వలేదు.

![]() |
![]() |