![]() |
![]() |

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన రెండో సినిమా 'అల.. వైకుంఠపురములో' ఇద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. త్రివిక్రమ్ రూపొందించిన ఆ చిత్రంలో బంటు అనే పాత్రలో బన్నీ, అమూల్య అనే పాత్రలో పూజ అలరించారు. వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియెన్స్ దాసోహమయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి బుట్టబొమ్మ పూజ చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.
రెండు రోజుల క్రితం తనకు కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందంటూ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా బన్నీ వెల్లడించాడు. దానికి పూజ స్పందిస్తూ, "అమూల్యకు బంటు కంపెనీ ఇస్తున్నట్లుగా ఉంది! జాగ్రత్తగా ఉండు అల్లు అర్జున్. నీకు కొంత హీలింగ్ లైట్‌ను, ఎనర్జీని పంపుతున్నా. నువ్వు త్వరగా ఆరోగ్యవంతుడివి అవుతావ్!" అని రిప్లై ఇచ్చింది. ఆమె కామెంట్ ఇప్పుడు వైరల్ అవడమే కాకుండా, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద పాయింట్ అయింది. ఇద్దరి ఫ్యాన్స్ పూజ రియాక్షన్‌పై తెగ కామెంట్లు చేస్తున్నారు.

సినిమా సెలబ్రిటీలు ఒకరి మీద ఒకరు సరదాగా మాట్లాడుకోవడం, సోషల్ మీడియాలో జోకులేసుకోవడం, అల్లరి కామెంట్లు చేసుకోవడం జరుగుతూ ఉండేదే. అదే తరహాలో సరదాగా బన్నీపై కామెంట్ చేసింది బుట్టబొమ్మ. ఇప్పటికే ఆమె కొవిడ్-19 సోకడంతో స్వీయ ఐసోలేషన్‌లో ఉంది. రెండు రోజులు గడిచాయో, లేదో బన్నీ కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో తనకు కంపెనీ ఇవ్వడానికే బన్నీకి కూడా కరోనా పాజిటివ్ సోకినట్లుగా ఉందని 'అల.. వైకుంఠపురములో' తాము చేసిన పాత్రల పేర్లను ఉపయోగిస్తూ కామెంట్ చేసింది పూజ.
![]() |
![]() |