![]() |
![]() |

ఎస్.జె. సూర్య.. కొన్నేళ్ళ క్రితం దక్షిణాదిన సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టార్ డైరెక్టర్. `వాలి`, `ఖుషి` (తమిళ్), `ఖుషి` (తెలుగు).. ఇలా ఒకదానిని మించిన విజయాలతో హ్యాట్రిక్ కెప్టెన్ అయిపోయారు సూర్య. ఆ తరువాత మాత్రం ఆ స్థాయి మ్యాజిక్ ని కొనసాగించలేకపోయారు. నటుడిగా రాణించాలనే ప్రయత్నంలో.. దర్శకుడిగా దెబ్బతిన్నారాయన. హ్యాట్రిక్ హిట్స్ తరువాత అరడజను సినిమాలతో పలకరించిన సూర్య.. వాటిలో రెండు సినిమాలతో మాత్రమే మెప్పించారు. అయితే.. కథానాయకుడు, ప్రతినాయకుడు వేషాలు వేస్తూ తమిళనాట బిజీ యాక్టర్ అయిపోయారు. ఆ కోణంలో సక్సెస్ ని కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆరేళ్ళ తరువాత మరోమారు మెగాఫోన్ పట్టేందుకు సూర్య ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్రిభాషా చిత్రంగా ఈ సినిమాని రూపొందించడమే కాకుండా తనే ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్.. 2022 జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనుందట. అలాగే ఏప్రిల్ నాటికి సినిమాని పూర్తి చేసే ఆలోచనతో ఉన్నారట సూర్య. `ఖుషి` 20 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి తాజాగా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు సూర్య. మరి.. సూర్య కొత్త ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
![]() |
![]() |