![]() |
![]() |

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ.. ఇలా నాలుగు భాషల్లో కలిపి దాదాపు 30 సినిమాలు చేసింది. అయితే ఎటొచ్చి ఇంతవరకు ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేసిన సందర్భం లేదు. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరనుందని సమాచారం. కాకపోతే, తను చేయబోయే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ.. సీరియస్ సబ్జెక్ట్ గా కాకుండా సరదాగా సాగిపోతుందట. అంతేకాదు.. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో దర్శనమివ్వనుందట రకుల్.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా సోషల్ మెసేజ్ తో కూడిన ఓ కామిక్ ఎంటర్ టైనర్ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇందులో నాయికగా రకుల్ ప్రీత్ ఎంపికైందని సమాచారం. అంతేకాదు.. ఈ చిత్రంలో `కండోమ్ టెస్టర్`గా ఆమె కనిపించబోతోందట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మరి.. ఈ బోల్డ్ ఎటెంప్ట్ రకుల్ కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం రకుల్ చేతిలో ఏడు ప్రాజెక్ట్ ఉన్నాయి. వాటిలో నాలుగు హిందీ సినిమాలు కాగా, రెండు తమిళ చిత్రాలు. మరొకటి వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన నవలాధారిత తెలుగు చిత్రం.
![]() |
![]() |