![]() |
![]() |

నటి యు-జంగ్ యూన్‌కు చీర్స్ చెప్సాల్సిందే. ఈ అత్యంత ప్రతిభావంతురాలైన కొరియన్ నటి 'మినరి'లో చేసిన పాత్రకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఆస్కార్‌ను అందుకున్నారు. 1980లలో అర్కాన్సస్‌లోని గ్రామీణ ప్రాంతంలో పొలం సేద్యాన్ని మొదలుపెట్టేందుకు కృషిచేసే ఓ ఫ్యామిలీ కథతో లీ ఐజాక్ చుంగ్ ఈ సినిమాని రూపొందించారు. ఆస్కార్ విజేతగా నిలిచిన కేవలం రెండో ఆసియా మహిళగా, తొలి కొరియన్ నటిగా యూన్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
హాలీవుడ్ అగ్రనటుడు బ్రాడ్ పిట్ నుంచి ఈ అవార్డును అందుకున్నారు యూన్. సందర్భవశాత్తూ 'మినరి'ని నిర్మించింది బ్రాడ్ పిట్‌కు చెందిన 'ప్లాన్ బి' బ్యానరే. సెట్స్‌లో తాను బ్రాడ్‌ను ఎప్పుడూ చూడలేదని చెప్తూ, "చివరకు మిమ్మల్ని కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను" అని తన స్పీచ్‌ను ఆమె ప్రారంభించారు. "నేనిక్కడ ఉన్నానని నమ్మలేకపోతున్నాను. OK. Let me pull myself together." అని ఆమె అన్నారు.
"మీకు తెలుసు, నేను కొరియా నుంచి వచ్చాను. నిజానికి నా పేరు యు-జంగ్ యూన్. చాలామంది ఐరోపావాళ్లు నన్ను యు యూన్ అనీ, వారిలో కొంతమంది యు-జంగ్ అనీ పిలుస్తారు. కానీ ఈ రాత్రి మీ అందర్నీ క్షమించేస్తున్నాను." అని సరదాగా అన్నారు. తాను పోటీని నమ్మనని ఆమె చెప్పారు. "గ్లెన్ క్లోజ్‌పై నేనెలా గెలిచాను?" అని ఆమె ప్రశ్నించారు. 'హిల్‌బిల్లీ ఎలిజీ'తో గ్లెన్ క్లోజ్ కూడా నామినేషన్ పొందారు.

73 సంవత్సరాల యూన్ తన 40 సంవత్సరాల సినీ, టీవీ కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. "మెరిల్ స్ట్రీప్ ఆఫ్ సౌత్ కొరియా"గా దేశం బయట గుర్తింపు పొందారు. 'మినరి'లో ఒక అసాధారణ బామ్మ పాత్రను పోషించారు.
![]() |
![]() |