![]() |
![]() |

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మాస్ లో మరింత ఫాలోయింగ్ పెంచిన సినిమా `సరైనోడు`. మాస్ ఎంటర్ టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఐదేళ్ళ క్రితం ఇదే ఏప్రిల్ లో విడుదలైన ఈ ఊర మాస్ బొమ్మ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. `సరైనోడు` ఐదేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా ట్విట్టర్ లో ఆ సినిమా తాలూకు ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. బన్నీ, బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందంటూ ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. రీసెంట్ గా అల్లు అర్జున్ తో బోయపాటి కథాచర్చలు జరిపారని.. బన్నీ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. ఓ ప్రముఖ నిర్మాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తారని.. 2022లో ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ కథనాల్లో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, బన్నీ ప్రస్తుతం `పుష్ప` చిత్రంతో బిజీగా ఉన్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని ఆగస్టు 13న విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బోయపాటి విషయానికొస్తే.. తన లక్కీ హీరో, నటసింహ నందమూరి బాలకృష్ణతో `అఖండ` చేస్తున్నారు. మే 28న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
![]() |
![]() |