![]() |
![]() |

`ఉప్పెన` చిత్రంతో డ్రీమ్ డెబ్యూ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తమ్ముడు.. ఇలాంటి ట్యాగ్స్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి ప్రయత్నంలోనే తనదైన అభినయంతో అలరించాడు. తొలి సినిమాతోనే రికార్డు స్థాయి వసూళ్ళను చూశాడు. ఒకవైపు ఈ ఘనవిజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు కొత్త చిత్రాలవైపు ఫోకస్ పెడుతున్నాడు వైష్ణవ్. ఇప్పటికే వెర్సటైల్ కెప్టెన్ క్రిష్ కాంబినేషన్ లో చేసిన నవలాధారిత సినిమా.. చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇక ఇటీవల గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా మొదలు పెడతాడు. అలాగే కింగ్ నాగార్జున నిర్మాణంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. తన డెబ్యూ ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో మరో రెండు సినిమాలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట వైష్ణవ్. ఈ రెండు చిత్రాల్లోనూ ఒక దానితో ఒకటి పొంతన లేని పాత్రల్లోనే తను కనిపించబోతున్నట్లు సమాచారం. మరి.. మైత్రీ కాంబోలో వైష్ణవ్ తేజ్ హ్యాట్రిక్ విజయాలను అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |