![]() |
![]() |

తెలంగాణ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొవిడ్-19 బారిన పడిన విషయం మనకు తెలుసు. "నాకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నా. కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది." అని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా కొవిడ్ గైడ్‌లైన్స్ పాటిస్తూ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెట్టారు.
అయితే వీరందరిలో నటి మంచు లక్ష్మి చేసిన ట్వీట్ సోషల్ మీడియా యూజర్స్‌ను బాగా ఆకర్షించింది. దానిపై వారు మామూలుగా స్పందించలేదు. ఇంతకీ ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే.. "కేటీఆర్.. త్వరగా కోలుకో బడ్డీ. ఇప్పుడు నా సినిమాలన్నీ చూడు." ఈ ట్వీట్‌తో పాటు ,దానికి అక్కి శ్రావణ్ అనే యూజర్ చేసిన కామెంట్ కలిసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాట్సప్ గ్రూపుల్లో ఇవి బాగా షేర్ అవుతున్నాయి.

లక్ష్మి చేసిన సూచనను కేటీఆర్ పాటిస్తున్నారో, లేదో తెలీదు. ఇటీవల 'పిట్టకథలు' అనే వెబ్ సిరీస్‌లో లక్ష్మి దర్శనమిచ్చారు. అంతకు ముందు ఆమె అనగనగా ఓ ధీరుడు, ఊ కొడతారా ఉలిక్కిపడతారా, దొంగల ముఠా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట,లక్ష్మీ బాంబ్, వైఫాప్ రామ్ లాంటి సినిమాల్లో నటించారు.
![]() |
![]() |